Corona Virus : కేరళలో అత్యధిక కేసులు.. రూపం మార్చుకుని వస్తుందట

కరోనా వైరస్ రూపం మార్చుకుని భారత్ లో విజృంభిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Update: 2025-05-26 11:59 GMT

కరోనా వైరస్ రూపం మార్చుకుని భారత్ లో విజృంభిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ లో ప్రస్తుతం 1009 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఈ ఏడాది వెయ్యి యాక్టివ్ కేసులు దాటడం ఇదే మొదటి సారి అని పేర్కొంది. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్ పై ప్రజల్లో భయాందోళనలు చెందాల్సిన పనిలేదని, రోగ నిరోధక శక్తి ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రాల్లో కూడా కరోనా వైద్యానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్ని రాష్ట్రాలకూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

రాష్ట్రాల్లో కేసుల సంఖ్య
కేరళ - 430
మహారాష్ట్రలో - 209
ఢిల్లీలో - 104
కర్ణాటకలో - 47
గుజరాత్ లో - 83
తమిళనాడు - 69
ఆంధ్రప్రదేశ్ - 04





Tags:    

Similar News