యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ.. క్లారిటీ ఇచ్చిన ఆర్థికశాఖ.. ప్రజలకు గుడ్ న్యూస్

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఖండించింది

Update: 2025-04-19 04:27 GMT

యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఖండించింది. రెండు వేల రూపాయలకు పైన జరిపే లావాదేవీలపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దంటూ ఆర్థిక శాఖ తెలిపింది.

వదంతులు నమ్మవద్దంటూ...
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ అంటూ కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నేపధ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.అలాంటి అంశం ఏదీతమ శాఖ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రమోట్ చేయడమే ముఖ్య ఉద్దేశ్యమని తేల్చి చెప్పింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అలాంటి ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్దకు రాలేదని కూడా స్పష్టం చేసింది.


Tags:    

Similar News