నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ పై చర్చించనున్నారు
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ పై చర్చించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సుష్మాస్వరాజ్ భవన్ లో కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రి వర్గం సమావేశమై పాక్ పై తీసుకున్న చర్యలను మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నారు.
కులగణనపై..
ఈ మంత్రివర్గ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు సహాయ, స్వతంత్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు. వారికి ఆపరేషన్ సింధూర్ తో పాటు తర్వాత వస్తున్న విమర్శలపై ప్రధాని వివరణ ఇవ్వనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన కులగణన చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.