Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆమోదించే అవకాశముందని తెలిసింది.
కీలక అంశాలపై...
మరొకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. వివిధ రాష్ట్రాలకు ముఖ్యంగా ఎన్నికలు జరిగే బీహార్, పశ్చిమబెంగాల్ కు సంబంధించిన నిర్ణయాలు కూడా ఉండే అవకాశముంది.