నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Update: 2025-07-16 02:14 GMT

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం పది గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రైతులు, ఉద్యోగుల అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు జనగణనపై కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు.

వర్షాకాల సమావేశాలపై...
అదే సమయంలో ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాల నుంచి వచ్చే విమర్శల నుంచి ఎదుర్కొనడంపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. పహాల్గామ్ దాడితో పాటు ఆపరేషన్ సింధూర్ వంటి విషయాల్లో విపక్షాలు వేసే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని చెప్పనున్నారు.


Tags:    

Similar News