Union Cabinet : నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రేపటి నుంచి ప్రధాని విదేశీ పర్యటన ఉండటంతో నేడు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ నివాసంలో ప్రారంభం కానున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.
కీలక సమస్యలను...
ప్రధానంగా ఖరీఫ్ సీజన ప్రారభం కావడంతో రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమ చేయడంపై చర్చింనున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని విషయాలపై కూడా చర్చించనున్నారు. ఇక రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా మంత్రులకు ప్రధానినరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.