నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలివే

నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీకానున్న క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు

Update: 2025-06-25 03:38 GMT

నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీకానున్న క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా జాతీయ, భ్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై కేంద్ర కేబినెట్ సమావేశం చర్చంచనుంది.

కీలక అంశాలపై...
అలాగే ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా భారత్ పై పడే ప్రభావం, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కేంద్ర కేబినెట్ లో సమీక్ష చేయనున్నారు. దీంతో పాటు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత పౌర విమానయాన శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చిచంనుంది. అలాగే వర్షాకాల పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించే అవకాశముంది. సమావేశాల్లో విపక్షాలను ధీటుగా ఎదుర్కొనాల్సిన అంశాలపై చర్చించనున్నారు.


Tags:    

Similar News