నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 9.45 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.కేబినెట్ భేటీకి ముందు సీసీఎస్ సమావేశం జరగనుంది. అయితే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు...
ప్రధానంగా రైతులకు చెల్లించాల్సిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలపై నేడు సమావేశంపై తేదీ ఖరారయ్యే అవకాశముంది. అదే సమయంలో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై కూడా చర్చించి ఆమోదించే అవకాశముందని తెలిసింది.