అమానవీయం.. చిన్నారి మృతదేహంతో 200 కిలోమీటర్ల పయనం

వివరాల్లోకి వెళ్తే.. కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ వలస కార్మికుడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు (కవలలు)..

Update: 2023-05-15 13:00 GMT

పశ్చిమ బెంగాల్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్ల దూరం బస్సులోనే ప్రయాణించాడు. వివరాల్లోకి వెళ్తే.. కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ వలస కార్మికుడు. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు (కవలలు) ఉన్నారు. ఇద్దరు పిల్లల వయసు 5 నెలలు. ఇటీవల ఇద్దరు పిల్లలకు అస్వస్థత చేయగా.. కలియాగంజ్ జనరల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఆ చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఒక బిడ్డ కోలుకోగా దేవశర్మ భార్య ఆ బిడ్డను తీసుకుని గురువారం (మే 11) ఇంటికి వెళ్లింది. అక్కడే చికిత్స పొందుతున్న మరో కుమారుడు శనివారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం వెళ్లగా.. డ్రైవర్లు రూ.8వేలు డిమాండ్‌ చేశారు. అంత డబ్బు తన వద్దలేక.. మరోదారి లేక చిన్నారి మృతదేహంతో బస్టాండ్ కు పయనమయ్యాడు. మృతదేహంతో బస్సు ఎక్కనివ్వరని భావించి మృతదేహాన్ని బ్యాగులో దాచి కలియాగంజ్‌లోని వివేకానంద కూడలిలో దిగాడు. అక్కడ ఓ వ్యక్తిని సంప్రదించగా.. అతను అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో..అక్కడి నుండి దేవశర్మ చిన్నారి మృతదేహంతో ఇంటికి చేరుకున్నాడు.


Tags:    

Similar News