నేడు ఆల్ ఇండియా బ్రేక్ డౌన్
నేడు గిగ్ వర్కర్ల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి
నేడు గిగ్ వర్కర్ల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో నేడు దేశ వ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మెకు దిగుతున్నారు. దేశ వ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపు నివ్వడంతో నేడు పలు సేవలు నిలిచిపోనున్నాయి. ఈరోజు మొత్తం ఆరు గంటల పాటు బ్రేక్ డౌన్ చేయాలని నిర్ణయించాయి. ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకూ సమ్మె జరగనుంది.
కార్మిక సంఘాల మద్దతుతో...
సమ్మెలో ఓలా, ఉబర్, రాపిడో డ్ైవర్లతో పాటు యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళనకు పిలుపు నిచ్చారు. డ్రైవర్లు యాప్ లను ఆఫ్ చేసి రైడ్స్ కు నిరాకరిస్తున్నారు. అనేక దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. కనీస ఛార్జీల కోసం డ్రైవర్లు దేశ వ్యాప్త సమ్మెకు దిగడంతో పాటు వీరికి మద్దతుగా కార్మిక సంఘాలు కూడా పిలుపు నిచ్చాయి. దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాల పిలుపు. తెలంగాణలోనూ గిగ్, టీజీ పీడబ్ల్యూ ఇతర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతుగా నిలిచాయి. అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు పిలుపు నిచ్చారు