పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం

పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నిర్ణయం తీసుకుంది

Update: 2026-03-26 08:02 GMT

పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీపెట్రోల్ తో పాటు డీజిల్ ధరలను పెంచింది. లీటరు పెట్రోల్ పై ఐదు రూపాయలు పెంచింది. లీటర్ డీజిల్ పై మూడు రూపాయలు పెంచుతున్నట్లు నయారా ఎనర్జీ సంస్థ ప్రకటించింది.

నయారా ఎనర్జీ సంస్థ...
దీంతో పాటు వివిధ రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్ ఆధారంగా కూడా ఈ పెంపుదల వర్తిస్తుందని నయారా ఎనర్జీ తెలిపింది. నయారా ఎనర్జీ సంస్థకు దేశ వ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోలు బంకులున్నాయి. మిగిలిన ప్రయివేటు రంగ చమురు సంస్థలు మాత్రం పెట్రోలు ధరలను పెంచలేదు. ఒక్క నయారా ఎనర్జీ మాత్రమే ధరలను పెంచింది.


Tags:    

Similar News