హిమాచల్ ప్రదేశ్ లో కుండ పోత వర్షం.. 75 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు సంభవించి ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో మృతుల సంఖ్య డెబ్భయి ఐదుకు చేరుకుంది. కొండ చరియలు విరిగిపడుతుండటంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ను నిలిపివేశారు.
వరదల్లో గల్లంతయిన వారి కోసం...
ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాల్లో వరదల్లో గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ భారీ వరదలకు హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు ముప్ఫయి ఒక్క మంది గల్లంతయ్యారు. ఇండో - టిబెటన్ సరిహద్దు బృందంలో కొంబడ చరియలు విరిగి పడి రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలు చేపట్టారు.