పహల్గాం ఘటనకు ముందు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది వీళ్ళే!!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.

Update: 2025-06-22 10:15 GMT

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడులకు తెగబడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపిన సరిగ్గా రెండు నెలల తర్వాత దాడి చేసిన వారికి ఆశ్రయం కల్పించడం, లాజిస్టికల్ మద్దతు అందించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఆ ఇద్దరు వ్యక్తులను పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌గా గుర్తించారు. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను కూడా వారు వెల్లడించారు.

Tags:    

Similar News