శ్రీలంక నుండి వచ్చిన తెలుగు వాళ్లు వీళ్ళే!!

తెలుగు మాట్లాడే వ్యక్తులు శ్రీలంకలో ఉన్నారంటే చాలా మంది నమ్మరేమో!!

Update: 2025-07-12 13:45 GMT

Sri Lanka

తెలుగు మాట్లాడే వ్యక్తులు శ్రీలంకలో ఉన్నారంటే చాలా మంది నమ్మరేమో!! శ్రీలంకలోని అహికుంటక తెగ లంకలో బతుకుతున్న తెలుగు మాట్లాడేవాళ్లే. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో తెలుగు నెరవు, తెలుగు జాతి ట్రస్ట్‌ వారిని సత్కరించాయి. తాము తెలుగులో మాట్లాడుతున్నా రాయడం, చదవడం రాదని, అసలు తెలుగులో వర్ణమాల ఉందన్న విషయం ఈ మధ్యే తెలిసిందని అహికుంటక తెగ వాళ్ళు చెప్పారు. మా ప్రధాన వృత్తి పాములు, కోతులను ఆడించడం.. ఈ తరంలో చాలామంది ఇతర వృత్తులను ఎంచుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో సంచార తెగల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నారని ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు తెలిపారు.

Tags:    

Similar News