ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎదురు కాల్పులు
ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరకణించినట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
ముగ్గురు మృతి...
మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. అయితే ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, సంఘటన స్థలం నుంచి ఆయుధాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇంకా భద్రతాదళాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.