వేగంగా పెరుగుతున్న ముస్లింల జనాభా?
ప్రపంచం లోని మతాల జనాభాకు సంబంధించి ప్యూ రీసెర్చి సెంటర్ జరిపిన అధ్యయనంలో వేగంగా పెరుగుతున్న మతంగా ఇస్లాం నిలిచింది.
ప్రపంచం లోని మతాల జనాభాకు సంబంధించి ప్యూ రీసెర్చి సెంటర్ జరిపిన అధ్యయనంలో వేగంగా పెరుగుతున్న మతంగా ఇస్లాం నిలిచింది. తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారి సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతోందట. క్రైస్తవుల సంఖ్య తగ్గుతోందని, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్యభాగం నాటికి క్రైస్తవంతో ఇస్లాం సమానం కానుందని ఈ లెక్కలు చెబుతున్నాయి.
హిందువుల జనాభా స్థిరంగా ఉండగా, బౌద్ధుల సంఖ్య తగ్గుతోంది. 2010-2020 కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా 2010లో 30.6 శాతం ఉండగా, అది 2020నాటికి 28.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా మాత్రం 34.70 కోట్ల మేర పెరిగింది. ఏ మతమూ లేదని చెప్పే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2 శాతం వరకు ఉంది. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్ సహారన్ ఆఫ్రికాలో పెరుగుతోంది. ఎలాంటి మతం లేదని చెప్పేవారి సంఖ్య అమెరికా, చైనా, జపాన్‌ల్లో అధికంగా ఉంది.