రౌడీల్లా రోడ్డు మీద కొట్టుకున్న అమ్మాయిలు

ఎప్పుడు జరిగిందో డేట్ సరిగా తెలియదు కానీ.. నడిరోడ్డుపై అమ్మాయిలు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2022-05-18 11:18 GMT

ఎప్పుడు జరిగిందో డేట్ సరిగా తెలియదు కానీ.. నడిరోడ్డుపై అమ్మాయిలు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా చదువుకునే అమ్మాయిలు.. బెంగళూరు లోని ప్రముఖ పాఠశాలకు ఎదురుగా ఉన్న సెయింట్ మార్క్స్ రోడ్డులో బాలికలు ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వాళ్ల గొడవను ఆపడానికి అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించినా కూడా వీలు పడలేదు. వైరల్ వీడియోలో స్కూల్ పిల్లలు.. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరితో ఒకరు కొట్టుకోవడం చూడవచ్చు. కొందరు పాఠశాల యూనిఫారం ధరించి ఉండగా, ఇంకొందరు సాధారణ దుస్తులు ధరించారు. ఒక అబ్బాయి విషయంలో వీరంతా గొడవ పడ్డారని తెలుస్తోంది. వైరల్ వీడియోలో, అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొట్టడానికి కర్రను తీసుకోవడం కూడా చూడవచ్చు. ఘటనా స్థలంలో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు.

వాగ్వాదం మధ్యలో, ఒక అమ్మాయి మరొక అమ్మాయి జుట్టు పట్టుకుని, కిందకు పడేసింది. గొడవ మరీ తీవ్రంగా మారకముందే.. స్థానికులు కొందరు అక్కడకు వచ్చి గొడవను ఆపారు. బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా వినియోగదారుల ప్రకారం, ఈ గొడవలో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వాటిలో ఒకటి బెంగళూరులోని ప్రసిద్ధ బిషప్ కాటన్ బాలికల పాఠశాల అని తెలిపారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ కాలేదు. పాఠశాలలు, కళాశాలల బాలికలు బహిరంగ ప్రదేశాల్లో గొడవలు పడుతున్న వీడియోలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. మే 1వ తేదీన తమిళనాడులోని మధురైలోని బస్టాప్‌లో పాఠశాల విద్యార్థినుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది.
Tags:    

Similar News