లండన్ లో స్థిరపడ్డాలన్న ఆశతో బయలుదేరిన కుటుంబం.. ఇంతలో!!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.
హోల్ ఫామిలీ
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడేందుకు వెళుతున్న ఒక కుటుంబం కూడా అందులో ఉంది. డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయాణమయ్యారు.
వారు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంతలో అహ్మదాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘోర ప్రమాదంలో డాక్టర్ ప్రతీక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్‌లతో పాటు వారి ముగ్గురు పిల్లలూ సంఘటనా స్థలంలోనే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.