పొలం దున్నిన సీఎం

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి పొలం పనులు చేశారు. నాగ్లా తరై గ్రామంలోని తన పంట పొలంలో దిగి

Update: 2025-07-06 13:00 GMT

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి పొలం పనులు చేశారు. నాగ్లా తరై గ్రామంలోని తన పంట పొలంలో దిగి, కూలీలతో కలిసి కొద్దిసేపు పని చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను సీఎం తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం ద్వారా రైతుల కృషి, త్యాగం, అంకితభావాన్ని స్వయంగా తెలుసుకున్నానన్నారు. అంతేకాకుండా పాత రోజులు గుర్తుకువచ్చాయన్నారు. రైతులు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదని, భావితరాలకు మన సంస్కృతిని అందించే వారధులని కొనియాడారు. హుడ్కియా బాల్ అనే సంప్రదాయాన్ని పాటించిన సీఎం ధామి భూమి, నీరు, మేఘాలకు పూజలు చేశారు.

Tags:    

Similar News