ఆధారాలు చూపి ఈ డబ్బు తీసుకోవచ్చు.. మూలుగుతున్న కోట్ల రూపాయలు

థానే జిల్లాలోని బ్యాంకులలో 452 కోట్లు డిపాజిట్లు మూలుగుతున్నాయి

Update: 2025-10-11 12:00 GMT

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని పలు బ్యాంకులలో 452 కోట్ల రూపాయలు పైగా డిపాజిట్లు క్లెయిమ్ కాకుండా పడి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు పదకొండు లక్షల అకైంట్లకు సంబంధించినవని అధికారులు తెలిపారు. మొత్తం 452 కోట్ల రూపాయలు క్లెయిమ్‌ చేయకుండా పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నిధులను హక్కుదారులకు తిరిగి అందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బ్యాంకు అధికారులు నిర్వహించారు. ‘క్లెయిమ్‌ యువర్‌ అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇది ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘యువర్‌ వెల్త్‌, యువర్‌ రైట్‌’ ప్రచారంలో భాగమని ఒక ప్రకటనలో తెలిపారు.

ఖాతాదారులకు అవగాహన....

బ్యాంకులో నగదు

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అన్ని బ్యాంకులు ఖాతాదారుల అవగాహన శిబిరాలు, అవుట్‌రీచ్‌ కార్యక్రమాల ద్వారా ఇందులో పాల్గొంటాయని తెలిపింది. జిల్లాలో మొత్తం 452.39 కోట్ల రూపాయల విలువై విలువైన డిపాజిట్లు 11.38 లక్షల ఖాతాదారుల పేర్లతో క్లెయిమ్‌ చేయకుండానే పడి ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ ఖాతాదారులు ప్రస్తుతం జీవించి ఉన్నా వచ్చి వారు తగిన పత్రాలను చూపి క్లెయిమ్ చేసుకోవచ్చు. జీవించి లేకపోతే వారి వారసులు కూడా 452 కోట్ల రూపాయలను ఆ పదకొండు లక్షల మంది బ్యాంకులకు వచ్చి తగిన ఆధారాలను చూపి తీసుకునే వీలుంటుంది. 

ఆధారాలు చూపించి...
అందుకోసం మూడు నెలల పాటు బ్యాంకు ఖాతాదారులకు పెద్దయెత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నారు. ఈ మూడు నెలల ప్రచారం ద్వారా ఆ డిపాజిట్లను హక్కుదారులైన ఖాతాదారులకు తిరిగి ఇవ్వడమే లక్ష్యమని, డిపాజిటర్లకు తమ నిధులను వడ్డీతో సహా తిరిగి పొందే పూర్తి హక్కు ఉందని, అవి డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌ కు బదిలీ అయినా కూడా క్లెయిమ్‌ చేసుకోవచ్చు,” అని థానే లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ అభిషేక్‌ పవార్‌ తెలిపారు. అయితే క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన ఆధారాలు, సాంకేతిక రుజువులు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్‌బీఐ రూపొందించిన UDGAM పోర్టల్‌ (https://udgam.rbi.org.in) ద్వారా పలు బ్యాంకులలో ఉన్న డార్మెంట్‌ ఖాతాలను ఒకే చోట సులభంగా తనిఖీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే తమ బ్యాంక్‌ శాఖలను సందర్శించి క్లెయిమ్‌, కేవైసీ ఫారాలు సమర్పించడం ద్వారా ఈ నిధులను తిరిగి పొందవచ్చని వివరించారు.



Tags:    

Similar News