ఎన్నికల వైపు తలపతి విజయ్ తొలిఅడుగు.. పోటీకి ఫ్యాన్స్ కు గ్రీన్ సిగ్నల్

తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు విజయ్ రాజకీయాలవైపుకి

Update: 2022-01-28 11:58 GMT

తమిళనాట సినీ స్టార్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఎక్కువకాలం పాలించిన వాళ్లు కూడా సినిమావాళ్లే. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలితను తమిళ జనాలు నెత్తినపెట్టుకున్నారు. వాళ్లు కూడా అక్కడి ప్రజలను అంతే భద్రంగా చూసుకున్నారు మరి. ప్రస్తుతానికి వస్తే.. ఇండస్ట్రీకి చెందిన మరెందరో స్టార్లు రాజకీయాల్లో ఉన్నారు. కమల్ హాసన్, విజయ్ కాంత్ లకు సొంతపార్టీలున్నాయి. రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి.. ఆరోగ్య విషయమై.. ఆఖరిలో ఆ నిర్ణయాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే.

ఇక తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు విజయ్ రాజకీయాలవైపుకి తొలి అడుగు వేశారు. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు తన అభిమాన సంఘం 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' సభ్యులకు విజయ్ అనుమతిచ్చారు. వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. అంతేకాదు.. ప్రచార సమయంలో తన ఫొటోలకు ఉపయోగించుకోవడానికి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఫిబ్రవరి 19వ తేదీన తమిళనాడులో పట్టణ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ ఎన్నికల్లోనే 'ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' పోటీ చేయనున్నారు. కాగా.. ఇప్పుడు తమిళనాడులో కొత్త చర్చ ప్రారంభమైంది. రాబోయే లోక్ సభ, రాజ్యసభ ఎన్నికల్లో విజయ్ పోటీ చేస్తారా ? అని చర్చించుకుంటున్నారు రాజకీయ పెద్దలు.






Tags:    

Similar News