Thu Mar 19 2026 06:48:46 GMT+0530 (India Standard Time)
నాటు బాంబును కొరికిన శునకం
నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న బస్టాండ్ వద్ద దుకాణాల మధ్యలోంచి భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో హృదయ విదారకమైన ఘటన జరిగింది. స్థానికంగా నాటు బాంబు కలకలం రేగగా.. ఓ శునకం ఆ బాంబుకు బలైంది. అడవి పందులకోసం ఉపయోగించే నాటుబాంబును శునకం నోటితో కొరకడంతో.. ఆ బాంబు పేలి.. శునకం తల ఛిద్రమై దుర్మరణం చెందింది. ఈ ఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో శాంతిపురం పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో జరిగింది.
Also Read : మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు అనుమానాస్పద మృతి
నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్న బస్టాండ్ వద్ద దుకాణాల మధ్యలోంచి భారీ శబ్దం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏమైందా అని చూసేసరికి.. ఓ శునకం చనిపోయి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో మరిన్ని నాటుబాంబులు ఉన్నాయా..? అన్న అనుమానంతో సోదాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసి.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story

