ఎల్.పి.జీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థితికి : కేంద్రం
క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది
క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారాలని వినియోగదారులను కోరుతున్నామని కేంద్రం చెప్పింది. పీఎన్‌జీ విస్తరించే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం కమర్షియల్ ఎల్‌పీజీ ని కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో రెండు వారాల్లో 1.25 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగలిగామన్న కేంద్రంఆన్‌లైన్ బుకింగ్‌లు 94 శాతం పెరిగాయని తెలిపింది.
బ్లాక్ మార్కెటింగ్ ను కట్టడి చేయడానికి...
నిన్న 57 లక్షల రిఫిల్ బుకింగ్‌లు వచ్చాయని, ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఎల్‌పీజీ బుకింగ్‌లు సాధారణ స్థాయికి చేరాయన్న కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్ కట్టడి చేయాలని రాష్ట్రాలకు లేఖ రాశామని చెప్పింది. ఉల్లంఘనలు జరిగిన చోట తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. 31 రాష్ట్రాలు, యూటీల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారని, 25 రాష్ట్రాలు, యూటీల్లో జిల్లాస్థాయి పర్యవేక్షక కమిటీలు ఏర్పాటు చేశారని కేంద్రం వెల్లడించింది.