Tamilnadu : ఊటీకి నేడు రేపు వెళ్లకండి.. తమిళనాడు సర్కార్ హెచ్చరిక
ఊటీలో నేడు, రేపు పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఎండల వేడిమిని తట్టుకోలేక అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఊటీకి వెళుతుంటారు. ఊటీలో చల్లటి వాతావరణం ఉంటుందని భావించి రెండు, మూడు రోజులయినా అక్కడ సేదతీరేందుకు వెళుతుంటారు. అందుకే సమ్మర్ లో ఊటీలో ఎక్కువ పర్యాటకులతో రద్దీగా ఉంటుంది. ఊటీలో నేడు, రేపు పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో...
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందులో ఊటీ కూడా ఉంది. దీంతో ఊటీకీ రెండు రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నేడు, రేపు ఊటీలో పలు పర్యాటక ప్రాంతాలు అధికారులు మూసివేశారు. అవసరమైతే తప్ప బయటకు రావొదదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.