కోల్డ్ రిఫ్ యజమాని రంగనాధ్ అరెస్ట్

తమిళనాడు కోల్డ్ రిఫ్ యజమాని రంగనాధ్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2025-10-09 04:29 GMT

తమిళనాడు కోల్డ్ రిఫ్ యజమాని రంగనాధ్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు రంగనాధన్ ను తమిళనాడులో అరెస్ట్ చేసి అక్కడకు తీసుకు వెళుతున్నారు. కోల్డ్ రిఫ్ మందు కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఇరవై మంది వరకూ చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా రంగనాధన్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇరవై మంది మరణించడంతో...
తమిళనాడుతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఈ దగ్గుమందును నిషేధించారు. వైద్యులు ఈ మందును ప్రిస్క్రైబ్ చేయవద్దని ప్రభుత్వాలు ఆదేశించాయి. తమిళనాడుకు చెందిన కంపెనీ ఈ దగ్గుమందు తయారు చేసి దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మందు తయారీలో లోపాలున్నట్లు గుర్తించిన పోలీసులు రంగనాధన్ ను అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్ కు తరలిస్తున్నారు.














Tags:    

Similar News