Delhi Bomb Blast Case : 2023 లోనే బాంబు పేలుళ్లకు కుట్ర జరిగిందా?
ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2023 లోనే దేశంలో ఈ పేలుళ్లు జరపాలని స్కెచ్ వేశారు. డాక్టర్ ఉమర్ కు 26 లక్షల రూపాయలు ఉగ్రవాద సంస్థల నుంచి అందినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఆరుగురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
బ్యాంకు ఖాతాల నుంచి...
వారి నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. వైద్యులయితే ఎవరికీ అనుమానం రాదని, అందుకే ఉగ్రవాద సంస్థల డాక్టర్లను ఈ ఉగ్రవాద చర్యలకు ఎంచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ విచారణలో బయటపడటంతో పలువురి బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటు ఎక్కడి నుంచి వీరికి నిధులు అందాయన్న దానిపై కూడా కస్టడీలో ఉన్న నిందితులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎర్రకోట బాంబు పేలుడుకు ముందు ఉగ్రవాదుల మధ్య వివాదం జరిగినట్లు కూడా గుర్తించారు. ముజమల్, ఉమర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు గుర్తించారు.