నేడు సుప్రీంకోర్టులో బీహార్ ఓటర్ల జాబితాపై విచారణ

బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది

Update: 2025-07-28 02:32 GMT

బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను సవరించడంపై అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. విపక్షాలకు చెందిన అనుకూల ఓట్లను తొలగించడానికి ఎన్నికలకు ముందు ఈ ఓటర్ల జాబితా సవరణను ప్రారంభించారని పిటీషనర్లు పేర్కొన్నారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో...
దీంతో పాటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఓటర్ల జాబితా సవరణ పేరిట తొలగింపులు, చేర్పులు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలయిన పిటీషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ వివాదంగా మారడంతో నేడు సుప్రీంకోర్టు ఏ రకంగా స్పందింస్తున్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News