Breaking : వీధికుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు
వీధికుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేయించాలని కూడా ఆదేశించింది
వీధికుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేయించాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. వీధి కుక్కలను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసేంత వరకూ వాటిని షెల్టర్లలోనే ఉంచాలని తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ కొత్తగా ఆదేశాలు ఇచ్చింది.
షెల్టర్లలో శాశ్వతంగా...
కరిచే కుక్కలను మాత్రం షెల్టర్లలో ఉంచి మిగిలిన కుక్కులను వీధుల్లోకి విడిచిపెట్టాలని తెలిపింది. అంతే తప్ప శాశ్వతంగా షెల్టర్లలో వాటిని బంధించకూడదని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది. అదే సమయంలో వీధికుక్కలకు ఆహారం బయట పెట్టరాదని కూడా ఆదేశించింది. ప్రజల ప్రాణాలు ఎంత ముఖ్యమో, వీధికుక్కల సంరక్షణ అంతే ముఖ్యమని తెలిపింది.