Breaking : ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది
telangana government, relief, supreme court, mlcs
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం క్విడ్ ప్రోకోకు దారి తీస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని పేర్కొంది. విరాళాల దాతల పేర్లు గోప్యంగా ఉంచడం సరికాదని పేర్కొంది.
నల్లధనం పేరుతో...
ఐదుగురు న్యాయమూర్తులున్న ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ప్రకారం విరుద్ధమని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాల్సిందేనని పేర్కొంది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఇతర మార్గాలున్నాయని తెలిపింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.