Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం.. శిధిలాల కింద తొమ్మిది మంది

ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో హుమయూన్ సమాధి నిర్మాణం కూలిపోయింది. దీంతో శిధిలాల కింద పడి తొమ్మిది మంది పడి చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2025-08-15 12:23 GMT

ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పురాతన భవనాలు కూడా దెబ్బతింటున్నాయి. తాజాగా ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో హుమయూన్ సమాధి నిర్మాణం కూలిపోయింది. దీంతో శిధిలాల కింద పడి తొమ్మిది మంది పడి చిక్కుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

సహాయక చర్యలు ముగిసిన తర్వాత...
వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తొమ్మిది మందిలో ఎంతమంది బతికి ఉన్నారన్న విషయం ఇంకా అర్థం కాలేదు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత కానీ మృతుల సంఖ్య ఎంతనేది తెలియదు. సహాయక బృందాలతో పాటు పోలీసులు కూడా రెస్క్యూ ఆపరేషన్ లలో పాల్గొంటున్నారు.


Tags:    

Similar News