Breaking : సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చలేదు

సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

Update: 2026-03-25 07:23 GMT

సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దనితెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న గడువును పెంచలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశంలో ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదని తెలిపింది.

పాత నిబంధనలే...
పాత నిబంధనలే నేటికీ అమలవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కు ఇరవై ఐదు రోజుల గడువు అలాగే ఉందని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఐదు రోజుల గడువు కూడా అలాగే ఉందని, నిబంధనలు మారాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Tags:    

Similar News