Stampade In Haridwar : తొక్కిసలాటకు అదే కారణమట
హరిద్వార్ లోని మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి చెందారు.
హరిద్వార్ లోని మాన్సాదేవి దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి చెందారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. అయితే భక్తులు మెట్ల మార్గం వైపు వెళుతుండగా విద్యుత్తు షార్ట్ సర్క్కూట్ జరిగిందన్న ప్రచారం జరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ తొక్కిసలాటలో మరణించిన ఆరుగురు మహిళ భక్తులు అని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో అనేక మంది తొక్కసలాటలో గాయపడినట్లు పోలీసు కమిషన్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో...
విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగిన మాట వాస్తవమేనని, అయితే అది వైరల్ గా మారడంతో తప్పించుకోవడానికి మహిళలు ఒక్కసారిగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. భయాందోళనలకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడానికి ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని, ఇది విషాదకరమని పోలీసులు తెలిపారు. అయితే విద్యుత్తు షాక్ ఎందుకు జరిగిందన్న దానిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
అనేక మందికి గాయాలు...
భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు అయినట్లు సమాచారం. తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ భక్తులతో పాటు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన భక్తులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే గాయపడిన వారిలో మరికొందరు పరిస్థితి ఎక్కువగా ఉందని తెలిసింది. తొక్కిసలాట జరిగినట్లు తెలిసిన వెంటనే అక్కడకు పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని అక్కడ భక్తులు క్యూ లైన్ లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరిపి ప్రాధమిక నివేదికను వెంటనే అందచేయాలని ఆదేశించారు.