టోల్ ఫీజుల మోత.. ఎప్పటి నుంచి అంటే?
టోల్ ఫీజు ధరలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది
టోల్ ఫీజు ధరలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వాహనాల వార్షిక టోల్ ధరలు పెంచుతూ జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. మూడు వేల రూపాయు నుంచి రూ.3,075కు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి...
దీంతో జాతీయ రహదారులపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది.ఏడాది కాలంలో 200 టోల్స్ ఫ్రీ జర్నీ ఉండనుంది. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. టోల్ ఫీజు ఒకేసారి చెల్లిస్తే ఏడాదిలో ఎన్నిసార్లయినా ప్రయాణించే వీలు కల్పిస్తూ గతంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.