Delhi Railway Station : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు అదే కారణమా?
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పద్దెనిమిది మంది మరణించారు
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పద్దెనిమిది మంది మరణించారు. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాకు హాజర్యేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మహా కుంభమేళాకు ఈనెల 26 వ తేదీ చివర కావడంతో శని, ఆదివారాలు ఎక్కువ మంది ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. దీంతో ఢిల్లీ రైల్వేస్టేషన్ లో అత్యధిక మంది భక్తులు చేరారు. శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న భక్తులు ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు అందుబాటులో ఉన్న రళ్లలో సీట్ల కోసం ప్రయత్నించారు. ఈ సందర్భంగా భక్తులు అధికంగా రాావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పద్దెనిమిది మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
రైల్వేస్టేషన్ లో ఉన్న...
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్న 12, 14, 15 ఫ్లాట్ ఫారంలోకి ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు చేరుకున్నాయి. వాటిని అందుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని రైళ్లలో ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పదకొండు మంది మహిళలతో పాటు నలుగురు చిన్నారులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. సీట్ల కోసం రైళ్లు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు ఈ తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సకాలంలో చేరుకోకపోవడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలిపారు.
సరైన భధ్రతా చర్యలు...
ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్ లు చేరుకుని అక్కడి నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారన్నది మాత్రం ఇంకా అధికారికంగా రైల్వే శాఖ ప్రకటించలేదు. మృతులను గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. రైల్వ స్టేషన్ లో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేసిన మోదీ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.