శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది.

Update: 2025-06-11 09:45 GMT


భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం-4 మిషన్‌ లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి నింగిలోకి వెళ్లాల్సి ఉండగా సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్‌ఎక్స్‌ తెలిపింది. రాకెట్‌లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ఎక్స్‌లో పేర్కొంది. త్వరలోనే కొత్త లాంచ్‌ తేదీని ప్రకటిస్తామని స్పేస్‌ఎక్స్‌ వెల్లడించింది.

అమెరికా స్పేస్ రీసెర్చ్ సంస్థ నాసా చేపట్టిన ఈ మిషన్‌లో భాగంగా శుభాంశు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌లో నింగిలోకి వెళ్లాల్సి ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించడానికి శుభాంశు సిద్ధమవ్వగా రోదసియాత్ర మరోసారి వాయిదా పడింది.

Tags:    

Similar News