సల్మాన్ ఖాన్ పిలిచాడంటూ లోపలకు వెళ్ళిపోయింది!!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించింది.

Update: 2025-05-23 12:39 GMT

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించింది. అక్రమంగా ప్రవేశిస్తున్న ఆమెను అధికారులు అడ్డుకోగా.. సల్మాన్ ఖానే తనను రమ్మన్నారని ఆమె చెప్పింది. ఆ తర్వాత విచారణలో అది నిజం కాదని తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.


ఇషా ఛాబ్రా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఖార్ ప్రాంతంలో నివసిస్తున్నానని, ఆరు నెలల క్రితం ఓ పార్టీలో సల్మాన్ ఖాన్‌ను కలిశానని ఇషా పోలీసులకు తెలిపింది. సల్మాన్ తో పరిచయం ఉందని, అందుకే వచ్చానని ఆమె చెప్పినట్లు పోలీసులు వివరించారు. సల్మాన్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను ఖండించారు.

Tags:    

Similar News