ఆకాశం నుండి దూకేసింది 71 ఏళ్ల వయసులో.. అంతరిక్షంలోకి వెళ్లాలని ఉందట!!
సాహసాలు చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు.
సాహసాలు చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు. కేరళకు చెందిన లీలా జోస్ అనే 71 ఏళ్ల మహిళ దుబాయ్‌లో 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. ఆమె తన కుమారుడితో కలిసి ఈ ఫీట్ సాధించారు. ఇడుక్కి జిల్లా కొన్నత్తడికి చెందిన లీలా గత నెలలో దుబాయ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సాహసం చేశారు. 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. ఈ సాహసంతో ఆగిపోవడం లేదని, అంతరిక్షంలోకి కూడా వెళ్లాలనుకుంటున్నానని అన్నారు.