ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
నిన్న జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి
నిన్న జమ్మూకాశ్మీర్ లో ఉగ్రదాడులకు తెగబడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. దాదాపు ఇరవై ఆరు మంది టూరిస్ట్ లు మృతి చెందగా, మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం.
ముగ్గురు మాత్రం...
ఇందులో ముగ్గురు మాత్రం టూరిస్ట్ లపై కాల్పులు జరపగా, మరొక ముగ్గురు మాత్రం భద్రతాదళాలు అటు వైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారంటున్నారు. టూరిస్టులందరినీ ఒక దగ్గరకు చేర్చిన టెర్రరిస్టులు విచక్షణారహితంగా పాయింట్ బ్లాంక్ తో కాల్చడంతో మారణహోమం సృష్టించారు. వారి ఆచూకీ తెలిపిన వారికి బహుమతి కూడా ప్రకటించే అవకాశముంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.