నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

నేటి నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Update: 2025-03-10 02:23 GMT

నేటి నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభలో కీలక బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలను విడతలుగా నిర్వహిస్తున్ననేపథ్యంలో నేటి నుంచి మరోసారి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య హీట్ డిస్కషన్ సాగే అవకాశముంది.

ట్రంప్ నిర్ణయాలపై...
ఈఏడాది జనవరి 31వతేదీ నుంచి ఫిబ్రవరి13వ తేదీ వరకూ తొలివిడతసమావేశాలు జరిగాయి. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చజరిగే అవకాశముంది. మణిపూర్ లో తాజా హింస వంటి అంశాలు కూడా పార్లమెంటు ఉభయ సభలను కుదిపేయనున్నాయి. వివిధ కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మణిపూర్ లో రాష్ట్రపతిపాలనకు ఆమోదం తెలపాలని కోరుతూ తీర్మానాన్ని హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు.


Tags:    

Similar News