Loksabah Elections : నేడు రెండో దశపోలింగ్

నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం పదమూడు రాష్టాల్లో 88 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి

Update: 2024-04-26 01:26 GMT

నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం పదమూడు రాష్టాల్లో ఎనభై ఎనిమిది పార్లమెంటు స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు పదహారు లక్షల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

88 స్థానాలకు...

ఈరోజు కేరళ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, జమ్ముకాశ్మీర్ లలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండో విడత ఎన్నికలలో మొత్తం 1,202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల స
సంఘం తెలిపింది. ఈరోజు రాహుల్ గాంధీ పోటీ చేసే వాయనాడ్ స్థానంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News