రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు. నిన్న భారత్ చేరుకున్న పుతిన్ రాష్ట్రపతికి వెళ్లి అనంతరం రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు. ఈరోజు హైదరాబాద్ హౌస్ లో భారత్ - రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. పలు అంశాలపై జరగనున్న ఒప్పందాలు జరగనున్నాయి. భారత మండపంలో జరిగే ఫిక్కీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో కలసి పుతిన్ హాజరు కానున్నారు.
నేడు శిఖరాగ్ర సమావేశం...
అనంతరం రష్యా ప్రభుత్వ ఛానెల్ ను భారత్ లో ప్రారంభించనున్నారు.ఈరోజు రాత్రికి రాష్ట్రపతి ఇచ్చే విందులో పుతిన్ పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు పుతిన్ రష్యా బయలుదేరి వెళ్లనున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డేగ కళ్లతో నిఘాను ఉంచారు. పుతిన్ బస చేసిన హోటల్ నుంచి ఆయన వెళ్లే దారులన్నింటిలోనూ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.