India : నేడు భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత్ కు రానున్నా
రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత్ కు రానున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు భారత్ లో పుతిన్ పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్న పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. పుతిన్ పర్యటలో భాగంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
ద్వైపాక్షిక సంబంధాలపై...
శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ శిఖరాగ్ర సమావేశంలో రక్షణ, వాణిజ్య రంగాల్లోనూ, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అయితే ఈరోజు మాత్రం భారత్, రష్యా రక్షణ మంత్రులు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పుతిన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ఇటీవల బాంబు పేలుళ్ల సంఘటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.