నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం

నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం కానున్నారు. బీహార్‌ ఎన్నికల్లో ఓటమిపై ఆర్జేడీ సమీక్షించుకోనున్నారు

Update: 2025-11-17 03:08 GMT

నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం కానున్నారు. బీహార్‌ ఎన్నికల్లో ఓటమిపై ఆర్జేడీ సమీక్షించుకోనున్నారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూఈ సమావేశానికి హాజరు కానున్నారు. అందరూ ఈరోజు పాట్నాకు చేరుకోవాలని తేజస్వి యాదవ్ సూచించారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఓటమికి కారణాలపై...
ఓటమికి ప్రధాన కారణాలపై చర్చించనున్నారు. ప్రతిపక్షంగా పోషించాల్సిన బాధ్యతపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అయితే ఇంత దారుణ ఓటమికి కారణాలేవన్నది క్షేత్రస్థాయి నుంచి తెలుసుకునే ప్రయత్నం ఆర్జేడీ నాయకత్వం చేస్తుంది. ఓటింగ్ శాతం తమకు బాగా వచ్చినా సీట్లు తగ్గడానికి గల కారణాలను కూడా చర్చించనుంది.


Tags:    

Similar News