ఈ సారి యధాతధమే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా యధాతధంగా ఉంచాలని నిర్ణయించింది.

Update: 2023-04-06 07:33 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్ల పెంపు విషయంలో ఖాతాదారులకు అనుకూల నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

ఎస్‌డీఎఫ్‌ రేటు...
ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. 2023-24లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష అని, ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైందని గవర్నర్ చెప్పారు.


Tags:    

Similar News