అదంతా ప్రచారమే.. ఆర్బీఐ క్లారిటీ

నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవన్న ప్రచారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది.

Update: 2025-01-22 11:24 GMT

నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవన్న ప్రచారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో కొత్త రూల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. సోషల్ మీడియాలో జరిగే అటువంటి ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది.

నమ్మవద్దంటూ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని, ఎలాంటి ఉత్తర్వులూ వెలువరించలేదని అధికారులు పేర్కొన్నారు. చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని స్పష్టంచేసింది. ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, బ్యాంకు అధికారులతో పాటు ఖాతాదారులు కూడా ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.


Tags:    

Similar News