Congress : రాహుల్, ప్రియాంక అరెస్ట్
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. బీహార్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల కేంద్రానికి ర్యాలీ టెన్షన్ మధ్య జరిగింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈసీ కార్యాలయానికి ముప్ఫయి మందిని మాత్రమే అనుమతించడంతో ఎక్కువ మందిని అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకున్నారు.
నిరసనకు బయలుదేరిన...
దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు బారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయిగే బ్యారికేడ్లను దూకారు. మహిళ ఎంపీలు కూడా నిరసనలో పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు ఎక్కువ మందిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.