వర్షాలు వచ్చేస్తున్నాయి

దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Update: 2023-10-20 09:32 GMT

దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆలస్యంగానే నిష్క్రమించాయి. దేశంలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభం కానుంది. నైరుతి తగినంత వర్షపాతం ఇవ్వలేదు. ఇక ఈశాన్య రుతుపవనాల మీదే ఆశలు పెట్టుకున్నారు రైతులు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి ఇది అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదిలి సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలోనూ ఓ వాయుగుండం ఏర్పడనున్నట్లు చెప్పారు. ఈశాన్య రుతు పవనాల ఆగమనంపై రాబోయే 3 రోజుల్లోనే స్పష్టత రానుంది.


Tags:    

Similar News