మృతులంతా ఢిల్లీ వాసులే
ఢిల్లీరైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది.
ఢిల్లీరైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల వివరాలను రైల్వే శాఖ ప్రకటించింది. ఎక్కువ మంది ఢిల్లీ వాసులున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగిన 18 మంది మరణించిన ఘటనలో కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది.
వీరే మృతులు...
నిన్న ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వచ్చిన భక్తులు తొక్కిసలాట జరగడంతో పద్దెనిమిది మంది మరణించార. మృతులు ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్, పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్ నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతామాలిక్, మమతాఝా, రియాసింగ్, బేబీకుమారి, మనోజ్ లుగా గుర్తించారు. మృతులంతా బిహార్, ఢిల్లీ వాసులేనని తెలిపారు.