రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
RRB NTPC 2024 notifications
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో 311 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో సీనియర్ పబ్లిసిటీ ఇన్స్ పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ ఫేర్ ఇన్ స్పెక్టర్నల్యాబ్ అసిస్టెంట్లు,జూనియర్ ట్రాన్స్ లేటర్లు,స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్ పెక్టర్, పోస్టులు ఖాళాగా ఉన్నట్లు తెలిపింది.
వచ్చే నెల 29వ తేదీ లోగా...
పోస్టును బట్టి ఇంటర్,డిప్లొమా,పీజీ, డిగ్రీ ఉత్తీర్ణులయి ఉండాలి. అభ్యర్థి వయసుపద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తులు డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకూ చేసుకోవచ్చు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. పూర్తి స్థాయివివరాలకు rrbcdg.gov.in/లో చూడవచ్చని తెలిపింది.