RRB : నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. కొత్త ఏడాది జాబ్ మేళా
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రైల్వే శాఖలో పనిచేయాలనుకున్న వారికి వచ్చే ఏడాది వరస నోటిఫికేషన్లు స్వాగతం పలకనున్నాయి. పదో తరగతి నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారందరూ ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వెలువడుతుంది.
వరస నోటిఫికేషన్లతో...
మార్చి నెలలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై నెలలో పారామెడికల్ తో పాటు జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఆగస్టు నెలలో ఎన్టపీపీ, సెప్టంబరు నెలలో మినిస్టీరియల్ అండ్ ఐసొలేటెడ్ కేటగిరీలు, అక్టోబరు గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. . దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో పరిశీలించుకోవాల్సి ఉంటుంది.